భారత్- బ్రిటన్ మధ్య గతేడాది జులైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 ఏప్రిల్‌లో అమలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫలితంగా భారత్ నుంచి వెళ్లే 99శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. అదేవిధంగా, భారత్లో కార్లు, విస్కీ వంటి బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గనున్నాయి. 2025 జులై 24న సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA)పై భారత్- యూకేలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం 34బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

