loader

అక్టోబర్ 6న రూ.15 వేల కోట్లతో టాటా క్యాపిటల్ ఐపీఓ

భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల మార్కెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి భారీ IPO రాబోతుంది. ప్రముఖ NBFC కంపెనీ అయిన టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లను సేకరించేందుకు IPOను (Tata Capital IPO 2025) ప్రారంభించనుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 6-8, 2025 వరకు ఉంటుంది, ఒక్కో షేరుకు ధర రూ.310-326గా నిర్ణయించారు. ఇది భారతదేశ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

H-1B వీసా అనిశ్చితి భారత్ మార్కెట్లపై ప్రభావం

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఈ రోజు కూడా ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు క్షీణతలో ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల క్షయంతో 81,800 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 80 పాయింట్లు తగ్గి 25,100 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి 7 పైసలు పడిపోయి 88.80 వద్ద రికార్డు కనిష్ఠాన్ని తాకింది. ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు కూడా […]

ఇడ్లీ, దోశ GST పై విరుచుకుపడ్డ పక్షాలు

దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం మరోసారి చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్నుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో ఎక్కువగా తినే ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధిస్తుండగా, ఉత్తరాదిలో ప్రాచుర్యం పొందిన చపాతీ, పరోటాలపై మాత్రం పన్నులు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి. “ఉత్తరాది ఆహారంపై జీఎస్టీ లేకపోతే, దక్షిణాది ఆహారంపై ఎందుకు?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

సుబ్బరామిరెడ్డి గాయత్రి ప్రాజెక్ట్స్‌కు బంపర్ ఆఫర్ – అప్పుల్లో 70 శాతం మాఫీ !

ప్రముఖ తెలుగు రాజకీయ నేతల్లో ఒకరు అయిన టి. సుబ్బారెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీకి బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రమోటర్లు సమర్పించిన రూ. 2,400 కోట్ల వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ప్లాన్‌ను ఆమోదించింది. ఈ ప్లాన్ ద్వారా కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతలకు రూ. 8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు చెల్లించి విముక్తలవుతారు. కంపెనీని మళ్లీ సొంతం […]

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు..స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్

భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మంచి జోష్‌లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వరుసగా రెండో రోజు సరికొత్త రికార్డులకు చేరాయి. సెప్టెంబర్ 17న ఇండియా-యూఎస్ ట్రేడ్ టాక్స్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు మళ్లీ షేర్ల కొనుగోళ్లలో మునిగిపోయారు. ఈ ఉత్సాహంలో నిఫ్టీ మొదటిసారి జూలై 11 తర్వాత 25,300 మార్క్‌ని అధిగమించింది. ఇప్పుడు అందరి దృష్టి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రిజల్ట్‌పై ఉంది.

నేపాల్‌లో విధ్వంసం.. ఖైదీలకు వరంగా మారింది..

సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగింది. యువకులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. కొందరు బిర్గుంజ్ జైలులోకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నేపాల్‌లోని బిర్‌గుంజ్ జైలుతో పాటు, అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు మహోతారి జైలు నుంచి 576, పోఖారా జైలు నుంచి 900 […]

అత్యంత ప‌లుచ‌ని డిజైన్‌తో స్లిమ్ ఐఫోన్ మోడ‌ల్‌ను లాంచ్ చేసిన యాపిల్‌..

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాజాగా నిర్వ‌హించిన త‌న ఈవెంట్‌లో ఐఫోన్ 17 ఫోన్‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఇదే ఈవెంట్‌లో ఐఫోన్ ఎయిర్ పేరిట మ‌రో ఐఫోన్ మోడ‌ల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది యాపిల్‌కు చెందిన ఎయిర్ సిరీస్‌లో వ‌చ్చిన మొద‌టి ఐఫోన్ కావ‌డం మాత్ర‌మే కాకుండా, అత్యంత ప‌లుచ‌ని ఐఫోన్ కావ‌డం కూడా విశేషం. చాలా స్లిమ్ డిజైన్‌తో లాంచ్ చేశారు. కేవ‌లం 5.6ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి ఉంటుంది.

బ్రాడ్‌కామ్‌తో కలిసి సొంత AI చిప్‌లను రూపొందించనున్న ఓపెన్‌ ఏఐ

ఓపెన్ ఏఐ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ను రూపొందించడానికి బ్రాడ్‌కామ్‌తో కలిసి పని చేయబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా NVIDIA చిప్‌లు ఆధిపత్యం చూపిస్తుండుగా NVIDIAపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఓపెన్ ఏఐ, ChatGPT వంటి AI మోడళ్ల కోసం అవసరమయ్యే ప్రాసెసింగ్ శక్తిని తన సొంత చిప్ ద్వారా స్వయంగా అందించాలనుకుంటోంది. తద్వారా NVIDIA వంటి పెద్ద చిప్ తయారీదారులపై ఆధారపడకుండానే AI సిస్టమ్‌లను నడిపించాలని ప్లాన్ వేసింది.

బెంగళూరులో యాపిల్ హెబ్బల్ స్టోర్ ప్రారంభం..

యాపిల్ హెబ్బల్ స్టోర్.. బెంగళూరు.. బైతరాయణపుర, బెల్లారీ రోడ్ లోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలోప్రారంభించింది. ఈ స్టోర్ దక్షిణ భారతదేశంలో యాపిల్ మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌గా నిలుస్తోంది. ఇది ముంబైలోని యాపిల్ బికెసి, న్యూఢిల్లీలోని యాపిల్ సాకేత్ స్టోర్‌లతో కలిసి ఉంటుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు కొద్ది రోజుల ముందు ఈ స్టోర్ ప్రారంభం కావడం విశేషం. బెంగళూరు టెక్ హబ్ స్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ స్టోర్‌ని యువ […]

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అర్మానీ మరణ వార్తను ఆయన ఫ్యాషన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ఫ్యాషన్ ఐకాన్ చిత్రాన్ని పంచుకుంటూ, సంస్థ ఇలా పేర్కొంది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, నిరంతర ప్రేరణ శక్తి అయిన సిగ్నర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON