loader

అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి.. ఫోటోలు వైరల్..!

సంగీత దర్శకుడు అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యా మారన్ వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 22, 2026న రెండో రోజు వేడుక జరగగా.. సినీ, క్రికెట్ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. నూతన జంట అనిరుధ్-కావ్యా మారన్‌ను ప్రత్యక్షంగా ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమంలో […]

ఏపీలో రేపే పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ప్రమాణ స్వీకారం…

ఆంధ్రప్రదేశ్‌‌లో మేయర్లు, చైర్‌ పర్సన్ల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు అయింది. స్థానిక సంస్థల్లో కొత్త పాలన రేపు అంటే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒకేసారి తొలి సమావేశాలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌ పర్సన్ల ఎన్నికల ప్రక్రియను కూడా నిర్వహించనున్నారు. రేపటి తొలి సమావేశం నుంచే స్థానిక సంస్థల […]

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇవాళ న్యూఢిల్లీలో వారిద్దరూ సమావేశమయ్యారు. నేపాల్ ప్రధానిని కలవడం సంతోషంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశంతో సన్నిహిత సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్‌కు షా వచ్చారని తెలిపారు. ఆ దేశంతో స్నేహాన్ని భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తోందని పేర్కొన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో షా […]

రాహుల్ గాంధీపై కంగన ఫైర్

భాజపా ఎంపీ కంగనా రనౌత్ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ఆమె.. ఆయన ప్రవర్తన అసహనంతో ఊగిపోతున్నట్లుగా ఉందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాలు కులతత్వం, పురుషాధిపత్య ధోరణితో వ్యవహరిస్తాయని రాహుల్ చేసిన వ్యాఖ్యల పైనా ఆమె స్పందించారు. ‘‘భాజపా పురుషాధిపత్య ధోరణి ఉన్న పార్టీ అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతోంది? ఈ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక దృక్పథం’’ అని […]

కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే రాజకీయం వదిలేస్తా – కేటీఆర్ సవాల్

అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్​ఎస్​ ​కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జన చైతన్యలో సభ కేటీఆర్​ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం లక్షాధికారులను చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే రాజకీయం వదిలేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. వరంగల్‌లో కనీసం వెయ్యి ఉద్యోగాలైనా కల్పించాలనే ఉద్దేశంతో 4 ఐటీ కంపెనీలు […]

ఎవరేం చేస్తున్నారో తెలుసు.. సీఎం రేవంత్ వార్నింగ్

ఎవరేం చేస్తున్నారో తమకు అన్నీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అంసతృప్తి నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ముందు ఏం చేస్తున్నారో, వెనుక ఏం మాట్లాడుతున్నారో తమ వద్ద డేటా ఉందని తెలిపారు. ఢిల్లీలో పరిచయాలుంటే, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. వ్యూహాలు, ఎత్తుగడలు మాకు వదిలేయాలన్నారు. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ అయిదేళ్లకోసారి మాత్రమే వస్తుందని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల అక్కడి నుంచి నేరుగా తన యలహంక నివాసానికి బయలుదేరారు. అయితే, కోర్టు ఉత్తర్వులు ఉండటం, శాంతిభద్రతల నేపథ్యంలో ఆమెను యలహంక ఇంటి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చేదు అనుభవం ఎదురైంది. తన తల్లి వైఎస్ విజయమ్మ, కుమారుడు రాజా రెడ్డి, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులతో బెంగళూరుకు చేరుకున్న షర్మిల కారులో వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని యలహంక నివాసానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులకు నచ్చజెప్పే […]

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైంది: సీఎం రేవంత్‌రెడ్డి

పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం 2022లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.1,580 కోట్లకు సంబంధించిన జీవో కూడా 2022లోనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన పలు కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

హైదరాబాద్​లో బాంబులు పేలుతాయంటూ బెదిరింపులు – పోలీసులు అప్రమత్తం

హైదరాబాద్​ నగరంలో పలు చోట్ల బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. 26/11 ముంబయి ఉగ్రదాడి తరహా దాడి జరుగుతుందని అందులో పేర్కొన్నారు. లష్కరే తయిబా పేరుతో దుండగులు హైదరాబాద్ పోలీసులకు మెయిల్ చేశారు. కాచిగూడ రైల్వేస్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద బాంబు పేలుస్తామంటూ మెయిల్​లో హెచ్చరించారు. తమ నేత లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామని బెదిరింపులకు దిగారు.మెయిల్​ నేపథ్యంలో నగర పోలీసులను స్పెషల్ బ్రాంచ్ అధికారులు […]

హైదరాబాద్ ఆకాశంలో ఉల్కాపాతం.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు

హైదరాబాద్ ఆకాశంలో అరుదైన లియోనిడ్ ఉల్కాపాతం కనువిందు చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో నగర ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఖగోళ అద్భుత సమయంలో మొత్తం 87 ఉల్కలను రికార్డు చేసినట్లు వారు వెల్లడించారు. షేక్‌పేట్‌లోని స్టార్ గేజర్స్ టెర్రస్ అబ్జర్వేషన్ స్టేషన్ నుంచి ఈ అపురూప దృశ్యాలను చిత్రీకరించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో భూమి 55పి టెంపుల్ అనే తోకచుక్క విడిచిపెట్టిన ధూళి కణాల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON