హైదరాబాద్ ఆకాశంలో అరుదైన లియోనిడ్ ఉల్కాపాతం కనువిందు చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో నగర ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఖగోళ అద్భుత సమయంలో మొత్తం 87 ఉల్కలను రికార్డు చేసినట్లు వారు వెల్లడించారు. షేక్‌పేట్‌లోని స్టార్ గేజర్స్ టెర్రస్ అబ్జర్వేషన్ స్టేషన్ నుంచి ఈ అపురూప దృశ్యాలను చిత్రీకరించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో భూమి 55పి టెంపుల్ అనే తోకచుక్క విడిచిపెట్టిన ధూళి కణాల గుండా ప్రయాణిస్తుంది.