బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల అక్కడి నుంచి నేరుగా తన యలహంక నివాసానికి బయలుదేరారు. అయితే, కోర్టు ఉత్తర్వులు ఉండటం, శాంతిభద్రతల నేపథ్యంలో ఆమెను యలహంక ఇంటి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చేదు అనుభవం ఎదురైంది. తన తల్లి వైఎస్ విజయమ్మ, కుమారుడు రాజా రెడ్డి, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులతో బెంగళూరుకు చేరుకున్న షర్మిల కారులో వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని యలహంక నివాసానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.