హైదరాబాద్ నగరంలో పలు చోట్ల బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. 26/11 ముంబయి ఉగ్రదాడి తరహా దాడి జరుగుతుందని అందులో పేర్కొన్నారు. లష్కరే తయిబా పేరుతో దుండగులు హైదరాబాద్ పోలీసులకు మెయిల్ చేశారు. కాచిగూడ రైల్వేస్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద బాంబు పేలుస్తామంటూ మెయిల్లో హెచ్చరించారు. తమ నేత లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామని బెదిరింపులకు దిగారు.మెయిల్ నేపథ్యంలో నగర పోలీసులను స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తం చేశారు.

