loader

ప్రధానిని కలిసిన ప్రిన్స్ విలియం దంపతులు

భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, రెండు దేశాల ప్రజల ఉమ్మడి శ్రేయస్సుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, యువరాణి కేట్ మిడిల్టన్‌తో ఆయన సమావేశమయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాజదంపతులు ఈ భేటీతో పర్యటన ముగించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న పర్యావరణ పరిరక్షణ పరిష్కారాలను ప్రోత్సహిస్తున్న ఎర్త్‌షాట్ ప్రైజ్ […]

విలన్‌గా గోపీచంద్.. క్లారిటీ ఇచ్చిన టీమ్..!

మ్యాచో స్టార్ గోపీచంద్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది. త్వరలో తెరకెక్కనున్న ఓ తమిళ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించబోతున్నాడంటూ ఈ వార్త జోరుగా వినిపిస్తోంది. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. అవి పూర్తిగా అవాస్తవమని గోపీచంద్ టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచారం చేయవద్దని మీడియా మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు గోపీచంద్ […]

ఔటర్ రింగ్‌ రోడ్డు నిర్మాణంపై బిగ్‌ అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,116.45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. టెండర్ల దాఖలుకు 2027 జనవరి 15వ తేదీని చివరి గడువుగా NHAI […]

రెండు ప్యాకేజీలుగా అమరావతి ORR నిర్మాణం

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా చేపట్టేందుకు NHAI సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి ప్యాకేజీలో కంచికచర్ల నుంచి అగిరిపల్లి మీదుగా ఉయ్యూరు వరకు 87.63 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనుంది. ఈ పనులకు రూ.7,873.40 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇక రెండో ప్యాకేజీలో భాగంగా ఉయ్యూరు నుంచి గుంటూరు మీదుగా తిరిగి కంచికచర్ల వరకు 107.50 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్యాకేజీ నిర్మాణానికి రూ.7,243.05 కోట్ల […]

భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది: రాహుల్ గాంధీ

భారత్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని, దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తయారీ రంగం బలహీనపడిందని, విద్యావ్యవస్థలోనూ లోతైన సమస్యలున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక విధానాలనే కొనసాగిస్తే మరో ఐదేళ్లు, పదేళ్లలో దేశం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ముఖాముఖి చర్చలో రాహుల్ మాట్లాడారు.మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు తయారీ రంగాన్ని పునరుద్ధరించడంలో విఫలమయ్యాయని రాహుల్ […]

3D భవనాలు, తెలుగులో లొకేషన్ల పేర్లు: యాపిల్ మ్యాప్స్‌లో సరికొత్త అప్‌డేట్!

భారతీయ వినియోగదారుల నావిగేషన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టెక్ దిగ్గజం యాపిల్ తన ‘యాపిల్ మ్యాప్స్’ (Apple Maps) యాప్‌లో కీలక మార్పులు చేసింది. మన దేశంలోని రహదారుల తీరుతెన్నులు, ప్రాంతీయ భాషల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త వెర్షన్‌ను తీర్చిదిద్దింది. బుధవారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ వినియోగదారులందరికీ ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఏపీలో పరిషత్ పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో కీలక ఘట్టానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తెరలేపింది. మండల, జిల్లా పరిషత్ ల పరోక్ష ఎన్నికలు, నూతన సభ్యుల పదవీకాలం ప్రారంభంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం రేపటి (నవంబర్ 19) నుంచి ప్రారంభం కానుండగా, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

మహా’ రాజకీయాల్లో వివాదాస్పదంగా సోనియా గాంధీ ‘ఆత్మకథ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ పుస్తకంలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్, మరాఠీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని శివసేన పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ముంబైలో బుధవారం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతలు పుస్తకంలోని 201, 443 పేజీలు చింపేసి నిరసన ప్రదర్శించారు. పుస్తక ప్రచురణకర్త హార్పర్కాలిన్స్ వెంటనే వివాదాస్పద భాగాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మహారాష్ట్రలో పుస్తక పంపిణీని నిలిపివేయాలని హెచ్చరించారు.

నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలుశిక్ష..

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అంతేకాదు, రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. తనను మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. బండ్ల గణేష్ కు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించింది.ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు న్యాయస్థానం నెల రోజుల […]

చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఘనస్వాగతం

రష్యా, చైనాలతో త్రైపాక్షిక చర్చలు చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. విమానాశ్రయంలో ట్రంప్ ను జిన్ పింగ్ ఘనంగా స్వాగతించారు. ట్రంప్ రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తుండగా.. ఇరువైపులా ప్రజలు, చిన్నారులు నిల్చొని పుష్పగుచ్ఛాలతో అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఒక దేశాధినేతను చైనాలో ఇంత ఘనంగా ఆహ్వానించడం అరుదు. గురువారం ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ సందర్భంగా ట్రంప్, జిన్పింగ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కానున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON