భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, రెండు దేశాల ప్రజల ఉమ్మడి శ్రేయస్సుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, యువరాణి కేట్ మిడిల్టన్తో ఆయన సమావేశమయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాజదంపతులు ఈ భేటీతో పర్యటన ముగించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న పర్యావరణ పరిరక్షణ పరిష్కారాలను ప్రోత్సహిస్తున్న ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రయత్నాలను మోడీ ప్రశంసించారు.