ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 195.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,116.45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. టెండర్ల దాఖలుకు 2027 జనవరి 15వ తేదీని చివరి గడువుగా NHAI నిర్ణయించింది.