భారతీయ వినియోగదారుల నావిగేషన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టెక్ దిగ్గజం యాపిల్ తన ‘యాపిల్ మ్యాప్స్’ (Apple Maps) యాప్లో కీలక మార్పులు చేసింది. మన దేశంలోని రహదారుల తీరుతెన్నులు, ప్రాంతీయ భాషల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త వెర్షన్ను తీర్చిదిద్దింది. బుధవారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ వినియోగదారులందరికీ ఈ అప్డేట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.