రష్యా, చైనాలతో త్రైపాక్షిక చర్చలు చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. విమానాశ్రయంలో ట్రంప్ ను జిన్ పింగ్ ఘనంగా స్వాగతించారు. ట్రంప్ రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తుండగా.. ఇరువైపులా ప్రజలు, చిన్నారులు నిల్చొని పుష్పగుచ్ఛాలతో అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఒక దేశాధినేతను చైనాలో ఇంత ఘనంగా ఆహ్వానించడం అరుదు. గురువారం ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ సందర్భంగా ట్రంప్, జిన్పింగ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కానున్నారు.