విశాఖపట్నం నుంచి యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు త్యాధునిక ఏసీ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. గురువారం నుంచి కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం బస్ సేవ’ పథకంలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు మొత్తం 80 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి.