ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. అధికారముంది కదా అని నేనేం ఏది చేసినా నడుస్తనుకుంటే మాత్రం ఖబడ్ధార్ బిడ్డా చెప్తున్నా యుద్దం స్టార్ట్ అయితని హెచ్చరించారు. మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు. తెలంగాణ అంటే ఒక కొడంగల్, మధిర నియోజకవర్గాలే కాదు.. ఇక్కడున్న పాలకులు మరొక్కసారి తప్పు చేస్తే మాత్రం యుద్ధం మొదలైతది.. ప్రజల సొమ్ము దోచుకున్నా.. ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు

