రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఇప్పుడు గణనీయంగా ఎక్కువ ఓట్లు సాధించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కూటమి బలాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశమని పేర్కొన్నారు.