loader

రాష్ట్రంలో ఏ వర్గం హ్యాపీగా లేదు: ధర్మాన

ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని YSRCP నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు ఆరోపించారు. అనుభవం అంటే ప్రజలను మోసం చేయడమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలు జరిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థను తనకు అనుకూలంగా నడిపిస్తున్నారని ధర్మాన ఆరోపించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఆత్మకథ ‘Belonging’ ఫస్ట్ లుక్ విడుదల

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌లోనే ‘Belonging: A Journey of Love’ పేరుతో రూపొందిన తన ఆత్మకథ ఫస్ట్ లుక్‌ను ఆమె పంచుకున్నారు. పుస్తకం తొలి ప్రతులను అందుకున్న సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాటిని పరిశీలించారు. అనంతరం ప్రియాంక తన తల్లికి స్వీట్లు తినిపించగా.. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను సోనియా గాంధీ తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా […]

టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అస్వస్థత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా యనమల తుని నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం నిద్రలేచిన ఆయనకు సుమారు పది గంటల సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన నీరసం ఆవరించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న అనుచర వర్గం ఆయనకు ప్రాథమిక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం కుదుటపడకపోవడంతో అంబులెన్స్ లో కాకినాడకు తీసుకువెళ్లారు.

ఫేక్ వాట్సప్ ఛానల్‌.. వార్నింగ్ ఇచ్చిన పవన్ కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ‘డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో కొనసాగుతున్న ఆ ఛానల్‌కు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నకిలీ వాట్సప్ ఛానల్‌ను నమ్మొద్దని, అందులోని సమాచారాన్ని అనుసరించవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు సూచించింది. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక […]

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తులు మృతి

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన భవానీ మాలధారులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో కత్తిపూడి వద్ద సాంకేతిక లోపం రావడంతో బస్సు రోడ్డు పక్కన నిలిచిపోయింది. బస్సు ఆగడంతో కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు పక్కకు వెళ్లారు. ఆ సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో కారు కాలినడకన వెళ్తున్న […]

పోలీసుల అదుపులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి

YSRCP ఎంపీ అవినాష్‌రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో ఆయనతో పాటు మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేశ్‌తో పాటు మరికొందరు నేతలను కడపలో అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకొస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఫ్రాన్స్ వెళ్తున్నారా..? జాగ్రత్త: భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

మౌలిక వసతుల లేమి, పెరుగుతున్న ధరల వంటి సమస్యలతో ఫ్రాన్స్ మండిపోడుతోంది. ఈ అశాంతియుత పరిస్థితులు, స్థానికంగా కర్ఫ్యూల నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలని పారిస్‌లోని భారత ఎంబసీ హెచ్చరించింది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న, ఆ దేశం వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు సూచనలు చేసింది. ‘‘నిరసన ప్రదేశాలు, జనాలు భారీగా గుమిగూడిన ప్రాంతాలకు వెళ్లొద్దు. ఎప్పటికప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక అడ్వైజరీలను గమనించుకోండి. రవాణాకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోండి’’ అని ఎంబసీ సూచించింది.

వివాదాస్పద కంటెంట్, సెన్సేషనలిజంపై కేంద్రం కొరడా

దేశంలోని ప్రసార నిబంధనలను తప్పక పాటించాలని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు సమాచార మంత్రిత్వ శా అడ్వైజరీ జారీ చేసీంది. కోడ్ ను ఉల్లంఘించే ఛానెళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, ఇటీవలి కాలంలో కొన్ని టీవీ ఛానెళ్లలో సున్నితమైన అంశాలు, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రసారమవుతున్న కథనాలు సెన్సేషనలిజం వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. AI వాడకంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. బేఖాతరు చేసే టీవీ ఛానెళ్ల లైసెన్స్ రద్దు చర్యలు […]

అమిత్ షాకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్ షా చేస్తున్న నిరంతర కృషిని వారు ప్రశంసించారు. ఆయన నాయకత్వం, దేశం పట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా బలమైన నాయకత్వాన్ని, దేశ భద్రత కోసం ఆయన […]

దేవరగట్టు కర్రల సమరంలో చిందిన రక్తం – ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లా దేవరగట్టులో ‘బన్ని’ ఉత్సవం సందర్భంగా హింస చెలరేగింది. కర్రల సమరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంప్రదాయబద్ధంగా సాగే కర్రల సమరం కాస్త, ప్రతీకార దాడులగా మారడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు గ్రామస్తులు ఒకరిపై ఒకరు దివిటీలు ఉద్దేశపూర్వకంగా విసిరేసు కోవడంతో మహిళలు గ్రామస్తులు, యువకులు, కొంతమంది పోలీసులు గాయపడ్డారు. గ్రామస్తులు ఒకరిపై ఒకరు కక్షపూరితంగా రాళ్లు, కర్రలు, దివిటీలతో తలపడడంతో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. కర్రలతో జరిగిన దాడిలో పోతురాజు (28) అనే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON