కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌లోనే ‘Belonging: A Journey of Love’ పేరుతో రూపొందిన తన ఆత్మకథ ఫస్ట్ లుక్‌ను ఆమె పంచుకున్నారు. పుస్తకం తొలి ప్రతులను అందుకున్న సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాటిని పరిశీలించారు. అనంతరం ప్రియాంక తన తల్లికి స్వీట్లు తినిపించగా.. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను సోనియా గాంధీ తన తొలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌గా పంచుకున్నారు.