YSRCP ఎంపీ అవినాష్‌రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో ఆయనతో పాటు మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేశ్‌తో పాటు మరికొందరు నేతలను కడపలో అదుపులోకి తీసుకుని పులివెందులకు తీసుకొస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు.