కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్ షా చేస్తున్న నిరంతర కృషిని వారు ప్రశంసించారు. ఆయన నాయకత్వం, దేశం పట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా బలమైన నాయకత్వాన్ని, దేశ భద్రత కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషిని సీఎం కొనియాడారు.

