ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని YSRCP నాయకుడు ధర్మాన ప్రసాద్ రావు ఆరోపించారు. అనుభవం అంటే ప్రజలను మోసం చేయడమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలు జరిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థను తనకు అనుకూలంగా నడిపిస్తున్నారని ధర్మాన ఆరోపించారు.