loader

విద్యుత్ అధికారులపై సిఎం రేవంత్ ఆగ్రహం

రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితుల్లో ఎందుకు మార్పు రావడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత వచ్చే ప్రమాదం ఉన్నా ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్పెషల్ సీఎస్, జెన్‌కో సీఎండీలను సైతం సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను వెంటనే తెలియజేయాలని […]

సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది: కేటీఆర్

సింగరేణిపై తుపాకి పెట్టి.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సాగును నాశనం చేస్తోందని సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సమావేశంలో కేటీఆర్ విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై నిందలు వేస్తోందన్నారు. ప్రభుత్వం సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఆయన వెల్లడించారు. అందుకే సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు.

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు.. 8 ఏళ్ల నాటి కేసులో ఊహించని ట్విస్ట్!

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు బిగ్ షాకిచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం నమోదు చేయబడిన కేసులో ధ్రువ్ రాఠీకి కొత్తగా సమన్లు జారీ చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వికాస్ […]

సీఎం రేవంత్ రెడ్డితో యూకే మేయర్ల బృందం భేటీ

హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఐర్డీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యూకే మేయర్ల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో యూకే పెట్టుబడులకు అవకాశాలు, యూకే-తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం దిశగా కార్యాచరణపై చర్చించారు. వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాలు, పరిశోధన, తయారీ రంగాలలో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ మీటింగ్ కు యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నలుగురు భారతీయులు ఐసీయూలో.. కేంద్రం కీలక ప్రకటన

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ కీలక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 10, 2026న జరిగిన ఈ ఘటనలో గాయపడిన భారతీయుల్లో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా, మరో నలుగురు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన బాధితులకు కూడా వైద్యసేవలు అందుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్‌ […]

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి

జర్మనీలోని బొఖుమ్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో 25, 27 ఏళ్ల ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. హత్య అనుమానంతో అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో ముగ్గురి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. పొగ పీల్చడంతో అస్వస్థతకు గురైన ఐదుగురిని ఆసుపత్రులకు తరలించారు.

ఉదయం రన్… సాయంత్రం బంద్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని స్టేజ్ -1 లో మొదటి, రెండవ పంపులను మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు.ఎట్టకేలకు నీరు విడుదల కావడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎంతో సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మోటర్లు ఆన్ చేసిన మూడు గంటల లోపే పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే భారీ మోటర్లను నడపడానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, లో-వోల్టేజ్ కారణంగానే మోటర్లను నిలిపివేయాల్సి వచ్చిందని […]

వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!

జనసేన పార్టీలో వంగవీటి రాధ చేరుతున్న సమయంలోనే, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను వచ్చారు. అయితే ఆయన్ను పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలిపేశారు. అలా ఓ పావు గంట పాటు సామినేని ఉదయ భాను పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కారులోనే గేటు బయట ఉండిపోయారు. ఆ తర్వాత పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఆయన్ను లోపలికి అనుమతించినట్లు తెలుస్తోంది. చివరికి సామినేని కారు […]

ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంక్‌..క్యాబినెట్ ఆమోదం

బ్యాంకింగ్‌ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వం, భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కలిగి ఉన్న వాటాలో అధిక భాగాన్ని వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కెనడా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కు  విక్రయించే వాటాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం ఈక్విటీ వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో 15 శాతం, […]

రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త వెనుక అసలు నిజాలివే!

బీహార్‌ రాహుల్ యాదవ్ అనే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి జూలీ అనే మహిళ భారత్‌కు వచ్చిందని వార్తలు విపరీతంగా హల్‌చల్ చేశాయి. ఈ ప్రచారం కేవలం ఒక సృష్టి అని, పూర్తి అబద్ధమని తేలింది. ఇంగ్లాండ్‌కు చెందిన శివియా ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ టీమ్‌తో ఉన్న విదేశీ మహిళ మా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక అతిథి. ఆమెతో తీసిన వీడియోను నేను సరదాగా షేర్ చేస్తే, కొందరు తప్పుగా ప్రచారం చేశారు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON