జనసేన పార్టీలో వంగవీటి రాధ చేరుతున్న సమయంలోనే, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను వచ్చారు. అయితే ఆయన్ను పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలిపేశారు. అలా ఓ పావు గంట పాటు సామినేని ఉదయ భాను పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కారులోనే గేటు బయట ఉండిపోయారు. ఆ తర్వాత పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఆయన్ను లోపలికి అనుమతించినట్లు తెలుస్తోంది. చివరికి సామినేని కారు దిగి నడుచుకుంటూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు.