రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితుల్లో ఎందుకు మార్పు రావడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత వచ్చే ప్రమాదం ఉన్నా ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీలను సైతం సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.