loader

చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ […]

మోదీ సర్కారుపై ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో తాము చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆరోపించారు. 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడం, బస్సుల రాకపోకలను నిలిపివేయడం లాంటి చర్యలతో ఢిల్లీలో లాక్ డౌన్ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. తమ నిరసనకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే భారీగా పోలీసులను మోహరించి ఆంక్షలు విధిస్తోందని ధ్రువ్ రాఠీ అన్నారు.

‘నోబెల్ శాంతి’ విజేతపై ట్రంప్ ఆగ్రహం

2026 నోబెల్ శాంతి బహుమతి నావి పిళ్లైకు దక్కడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ‘అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు. నోబెల్ కమిటీ నిర్ణయం ఆ బహుమతి గౌరవాన్ని తగ్గించిందని ఆ పోస్టులో విమర్శించారు. శాంతి స్థాపనకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించి తనకే ఈ పురస్కారం ఇవ్వాల్సిందని ఆ పోస్ట్‌లో ట్రంప్ […]

‘మీరా మాకు నీతులు చెప్పేది’ .. మస్క్‌పై కమల్‌ ఆగ్రహం

మస్క్ భారత్ గురించి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశ పాలసీని కూడా ఏ బిలియనీర్ నిర్దేశించకూడదు. అది అమెరికా బిలియనీర్ అయినా సరే ఇది వర్తిస్తుంది. మా దేశ భవిష్యత్తును మేమే స్వయంగా నిర్ణయించుకుంటాం. అంతే తప్ప బయటి వ్యక్తులు కాదు. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై స్వయంగా 100శాతంం టారిఫ్స్ విధిస్తున్న అమెరికా.. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు కూడా జాతీయ భద్రతే అత్యంత ముఖ్యం […]

‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక.. దీని కథేంటో తెలుసా?

రష్మిక ధరించిన ఈ చీర ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం, సంగీత వారసత్వానికి ప్రతీకగా దీన్ని అభివర్ణిస్తున్నారు. పట్టుచీరల్ని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎంతో ఇష్టపడేవారట.రంగురంగుల కాంచీపురం పట్టుచీరల్లో ముస్తాబై సంగీత కచేరీల్లో పాల్గొనేవారామె. 1951లో చెన్నైలోని ఓ ఫ్యాషన్ స్టోర్ కి నీలి రంగు దారాన్ని తీసుకెళ్లి.. ఆ రంగులో చీరను నేయమని కోరారట. దీనివల్లే ఈ మిక్స్డ్ కలర్ రాయల్ బ్లూ షేడ్ కు ‘ఎంఎస్ బ్లూ’ అనే పేరు వచ్చిందట. ఇలా ఒక రంగుకు గాయని […]

రాంచీలో సంజూ విధ్వంసం.. విండీస్ ముందు 250 పరుగుల భారీ టార్గెట్!

వెస్టిండీస్​తో రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (82 పరుగులు, 41 బంతుల్లో) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించగా, తిలక్ వర్మ (44* పరుగులు, 18 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. భారత బ్యాటర్ల ఊచకోత ముందు వెస్ట్ ఇండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా […]

అక్టోబర్ 13న కొత్త హోమ్ ప్రొడక్ట్స్ లాంఛ్!

ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన తదుపరి ఉత్పత్తుల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 13న జరగనున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ వీడియోను కంపెనీ వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ ఎస్‌వీపీ గ్రెగ్ జోస్వియాక్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘Welcome Home’ అనే పేరుతో విడుదలైన ఈ వీడియోతో, యాపిల్ కొత్త హోమ్ డివైజ్‌లను ఆవిష్కరించబోతుందని అంచనా, యాపిల్ టీవీ 4K, హోమ్‌పాడ్ మినీ 2 మరియు కొత్త స్మార్ట్ హోమ్ హబ్ వంటి ఉత్పత్తులను […]

కాళను గొలుసులతో బంధించి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో కాళ్లకు గొలుసులతో నూతన వధూవరులు ఓ నదిలో శవాలుగా తేలారు. మృతులను అమల్నేర్ తాలూకాలోని పడల్సారే గ్రామానికి చెందిన దంపతులు శ్యామ్ హరి పాటిల్ (28), సప్నా శ్యామ్ పాటిల్ (20)గా గుర్తించారు. కొన్ని నెలల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకొని, ఉట్రాన్ గ్రామంలో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పారిపోకుండా ఉండేందుకే ఎవరైనా ఈ జంట కాళ్లకు గొలుసు కట్టి నదిలో తోసేశారా? లేదా వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే […]

“వాళ్లను ఎవరూ ఆపలేరు..!” కాక్రోచ్ లకు మద్దతుగా మోడీ కేబినెట్ మంత్రి..!

కాక్రోచ్ ల నిరసనను అఢ్డుకునేందుకు ఢిల్లీలో రైళ్లను రద్దు చేస్తూ, స్టేషన్లను మూసేస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు. “వీరు భారతదేశ యువత-వారిని ఏదీ ఆపలేదు. ఇలాంటి అపోహలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని నేను అడుగుతున్నాను: నిజంగా ఎవరైనా ఎన్ని రైళ్లను ఆపగలరు? ఎంత అనుసంధానాన్ని అడ్డుకోగలరు? ఎన్ని రోడ్లను దిగ్బంధించగలరు? వీరు భారతదేశ యువత; గత తరాలు చేసినట్లే, ప్రపంచానికి మార్గం చూపించే సామర్థ్యం వీరికి ఉంది-అందువల్ల, వారిని ఏదీ […]

సీజేపీ నిరసనల్లో పాల్గొంటా.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..

దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో అక్టోబర్ 10న జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో తన కుటుంబంతో కలిసి పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆప్ జాతీయ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON