దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో అక్టోబర్ 10న జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో తన కుటుంబంతో కలిసి పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.