పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న అవినీతి, వ్యక్తిగత ఆరోపణలపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. మీడియాలో, సోషల్ మీడియా వేదికల్లో ఆయనపై వస్తున్న వరుస కథనాలపై సమగ్ర విచారణ జరిపేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున ఒక హైలెవల్ కమిటీని నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.గతంలో
హెచ్చరించినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు రాకపోవడంతో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

