మస్క్ భారత్ గురించి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశ పాలసీని కూడా ఏ బిలియనీర్ నిర్దేశించకూడదు. అది అమెరికా బిలియనీర్ అయినా సరే ఇది వర్తిస్తుంది. మా దేశ భవిష్యత్తును మేమే స్వయంగా నిర్ణయించుకుంటాం. అంతే తప్ప బయటి వ్యక్తులు కాదు. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్పై స్వయంగా 100శాతంం టారిఫ్స్ విధిస్తున్న అమెరికా.. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు కూడా జాతీయ భద్రతే అత్యంత ముఖ్యం అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.