2026 నోబెల్ శాంతి బహుమతి నావి పిళ్లైకు దక్కడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ‘అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు. నోబెల్ కమిటీ నిర్ణయం ఆ బహుమతి గౌరవాన్ని తగ్గించిందని ఆ పోస్టులో విమర్శించారు.
శాంతి స్థాపనకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించి తనకే ఈ పురస్కారం ఇవ్వాల్సిందని ఆ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.