దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న నిరసనల నేపథ్యంలో భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 57 మెట్రో స్టేషన్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య చేరాల్సిన మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కనాట్ ప్లేస్ ప్రాంతంలోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్ల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.