గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో రాత్రివేళల్లో గంటల తరబడి నృత్యం చేయడంతో పాటు, ఫొటోలు, వీడియోల్లో అందంగా కనిపించాలని తక్షణ శక్తి లభిస్తుందని, చర్మం కాంతివంతంగా కనిపిస్తుందని భావించి విటమిన్ సి, బి-కాంప్లెక్స్, జింక్, గ్లుటాథయోన్ మిశ్రమంతో ఐవీ డ్రిప్ ఎక్కించుకుంటున్నారు. 45 నిమిషాల ఒక్క సెషన్‌లొ అలసట తగ్గి, ముఖం తాజాగా కనిపిస్తుందనీ చేయించుకుంటున్నారు. ఒక్కో సెషన్‌కు రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని క్లినిక్‌లకు 30, 40 ఏళ్ల వయసున్న వారు కూడా వస్తున్నారట.