శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 879.09 పాయింట్లు లేదా 1.23 శాతం లాభంతో 72,472.33 వద్ద, నిఫ్టీ 288.65 పాయింట్లు లేదా 1.30 శాతం లాభంతో 22,520.45 వద్ద నిలిచాయి. సైయంట్ లిమిటెడ్, కేఈసీ, ఆదిత్య ఇన్ఫోటెక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ , ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, పైన్ ల్యాబ్స్ నష్టాల జాబితాలో చేరాయి.