loader

ఐటీ దిగ్గజాలకు అమెరికా షాక్

ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్ సీఎల్, క్యాప్ జెమినీ, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ సంస్థలకు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ఫైలింగ్స్ అమెరికా నిలిపివేసింది. ఇది లేకుండా ఆయా సంస్థల ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ పొందడం సాధ్యం కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. “2009 నుంచి ఈ కంపెనీలు వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశాయి. భారీగా హెచ్ 1 బీ వీసాలు, శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయి. అమెరికా కార్మికుల నుంచి లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయి” అని […]

విశాఖ వేదికగా వైసీపీ బీసీ గర్జన.. 16న భారీ సభ

ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన తరగతుల (బీసీ) గొంతును మరింత బలంగా వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 16న విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. వెనుకబడిన వర్గాల గర్జన సభ ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకునే అవకాశం ఉంది. నిక సంస్థలు మరియు ఇతర రంగాల్లో రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బీసీ వర్గాలను తీవ్రంగా […]

ఇండియాకు రియల్ బాస్ అంబానీయేనా? ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో కొంత మంది కుబేరుల ఏకఛత్రాధిపత్యం నడుస్తోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కంటే పెట్టుబడిదారులకే రక్షణగా ఉంటుందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ నెటిజన్ పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ స్టార్‌లింక్ 165కు పైగా దేశాలలో లైసెన్సులను పొందింది.. భారత ప్రభుత్వ ప్రతి చట్టం, నిబంధనను పాటించడానికి ఐదేళ్లు కేటాయించాం.. అయినా ఇప్పటికీ లైసెన్సు ఎందుకు రాలేదు? దేశంలో రియల్ బాస్ అంబానీయేనా ’’ అంటూ ఎలాన్ […]

విజయ్ దేవరకొండ ‘రణబాలి’.. ట్రైలర్ వచ్చేసింది

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై.రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఓ శక్తిమంతమైన యోధుడి పాత్రలో అలరించనున్నారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా పేలిన ఏడు గ్యాస్ సిలిండర్లు

ములుంద్ ఈస్ట్‌లోని టాటా కాలనీలో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధారావి పునరావాసంలో భాగంగా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోని కార్మికుల క్యాంప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ధారావి నుంచి తరలించిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కు చెందిన ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ (PAP) పథకంలో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది.

రియాద్ కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

సౌదీ అరేబియా లక్ష్యంగా హూతీ రెబల్స్ దాడులకు పాల్పడుతున్న వేళ ఇండిగో, ఎయిరిండియా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ రాజధాని రియాద్లోని అంతర్జాతీయ విమనాశ్రయంపై దాడి నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీ వరకు ఆ నగరానికి విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి రిఫండ్ చెల్లించనున్నట్లు తెలిపాయి. దీనివల్ల ప్రభావితమైన ప్రయాణికులకు ఉచితంగా రీషెడ్యూల్ చేసుకొనే అవకాశం కల్పించాం అని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ అధికార ప్రతినిధి […]

మోదీ, అమిత్‌ షాకు సద్బుద్ధి కలగాలని రాజ్‌ఘాట్‌ వద్ద ఇండియా నేతల ప్రార్థనలు

స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశీస్సులతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన ఆగదని తేల్చి చెప్పారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కలిసి దాదాపు 300 మంది ఉభయ సభల ఎంపీలు బస్సులో రాజ్ ఘాట్​కు వెళ్లారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద ఒక్కొక్కరుగా నివాళులర్పించారు. దిల్లీలో శుక్రవారం […]

“జ్ఞానేష్ మాత్రమే కాదు. గతంలో ఆయన కూడా”-ప్రశాంత్ కిషోర్ సంచలనం..!

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బీహార్ ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదంపై స్పందించారు.జ్ఞానేష్ కుమార్‌కు ముందు రాజీవ్ కుమార్ ఉండేవారని, ఆయన కూడా ఎన్నికల సంఘాన్ని దాదాపు ఇదే పద్ధతిలో నడిపారని పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సికి ఛైర్మన్‌గా నియమితులయ్యారని గుర్తుచేశారు. కాబట్టి, ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్ట, విశ్వసనీయత ప్రమాదంలో ఉన్నాయన్నారు.

అది ఫేక్ ఫొటో.. నమ్మొద్దు : సీపీ సజ్జనార్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ ఫొటో అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు కొందరు తన ఫొటోను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ సినీనటుడు ఎన్టీఆర్ కు చెందిన సోషల్ మీడియా ఖాతాను ట్యాగ్ చేశారు. దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే…” పాటను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన నిందితులను సీపీ సజ్జనార్ అరెస్ట్ చేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ స్పందించి.. అది ఫేక్ […]

చిన్న వ్యాపారులకు ఊరట కల్పించేలా GST నిర్ణయాలు

జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశంలో వివిధ వస్తువులు మరియు సేవలపై విధించే పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతమున్న జీఎస్టీ శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సాధారణ జరిమానా మొత్తాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. గతంలో ఉన్న రూ.25,000 జరిమానాను రూ.10,000కు కుదించారు. పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని రద్దు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు (ప్రాసిక్యూషన్) తీసుకునే పరిమితిని రూ.1 కోటి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON