స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశీస్సులతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన ఆగదని తేల్చి చెప్పారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కలిసి దాదాపు 300 మంది ఉభయ సభల ఎంపీలు బస్సులో రాజ్ ఘాట్‌కు వెళ్లారు. జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద ఒక్కొక్కరుగా నివాళులర్పించారు. దిల్లీలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్టు తెలిపారు.

