ములుంద్ ఈస్ట్‌లోని టాటా కాలనీలో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధారావి పునరావాసంలో భాగంగా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోని కార్మికుల క్యాంప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ధారావి నుంచి తరలించిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కు చెందిన ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ (PAP) పథకంలో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది.