భారత్‌లో కొంత మంది కుబేరుల ఏకఛత్రాధిపత్యం నడుస్తోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కంటే పెట్టుబడిదారులకే రక్షణగా ఉంటుందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ నెటిజన్ పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ స్టార్‌లింక్ 165కు పైగా దేశాలలో లైసెన్సులను పొందింది.. భారత ప్రభుత్వ ప్రతి చట్టం, నిబంధనను పాటించడానికి ఐదేళ్లు కేటాయించాం.. అయినా ఇప్పటికీ లైసెన్సు ఎందుకు రాలేదు? దేశంలో రియల్ బాస్ అంబానీయేనా ’’ అంటూ ఎలాన్ మస్క్ పోస్ట్ పెట్టారు.

