సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ ఫొటో అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు కొందరు తన ఫొటోను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ సినీనటుడు ఎన్టీఆర్ కు చెందిన సోషల్ మీడియా ఖాతాను ట్యాగ్ చేశారు. దేవర’ చిత్రంలోని “చుట్టమల్లే…” పాటను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన నిందితులను సీపీ సజ్జనార్ అరెస్ట్ చేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ స్పందించి.. అది ఫేక్ ఫొటో అని క్లారిటీ ఇచ్చారు.