శ్రీచైతన్య హాస్టల్లో విద్యార్థిపై దాడి
నాచారంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల హాస్టల్‌లో తన సొంత ఫోన్ తీసుకొని మాట్లాడాడనే చిన్న కారణంతో ఆగ్రహంతో వార్డెన్ చందు బలంగా కొట్టడంతో విద్యార్థి చెవి కర్ణభేరి పగిలిపోయి విపరీతంగా రక్తస్రావమైంది. ఈ దాడి విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని, తమ కుమారుడి పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.వార్డెన్ చేసిన తీవ్ర దాడి కారణంగా తమ బిడ్డకు ఏకంగా 50 శాతం వినికిడి లోపం ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

