2026 ఏడాదికి గానూ నోబెల్ పురస్కారాలు ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమైంది. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ వరించింది. కాంతి నియంత్రిత అయాన్ ఛానల్స్, ఆప్టోజెనెటిక్స్కు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ కార్ల్ డిసెరోథ్, పీటర్ హెగెమన్, జార్జ్ నగెల్కు నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యంలో విశేష కృషి చేసిన వారి పేర్లను వెల్లడించనున్నారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 12న అర్థశాస్త్రంలో నోబెల్పై ప్రకటన రానుంది.