తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోషి నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ అపరేష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ పి. సామ్ తొలుత మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్లో 1991 నుంచి 2000 అక్టోబర్ వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం 2000 నవంబర్ నుంచి ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో ప్రాక్టీస్ చేస్తూ దాదాపు 13 ఏళ్ల పాటు న్యాయవాదిగా కొనసాగారు. 2013లో ఛత్తీస్గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి నియమితులయ్యారు.

