ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణ పతకంతో మెరిసిన ప్రముఖ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. జపాన్‌లో జరిగిన ఈ క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. తండ్రి సురేంద్రకుమార్‌తో కలిసి ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో 2028 ఒలింపిక్స్ పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని లోకేష్ సూచించారు. ఆ లక్ష్యానికి అవసరమైన సహకారం అన్నివిధాలా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

