ట్రిపుల్ తలాక్ అంశంపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ప్రశ్నలు లేవనెత్తారు. సామాజిక, మతపరమైన సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం సమాజంలోని సంస్కరణలు వేరే వాళ్లు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చట్టం తీసుకురావాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అవసరమైన మార్పులు ఎందుకు చేయలేదని జావేద్ ప్రశ్నించారు. సామాజిక సంస్కరణలు ముందుగా సమాజంలో నుంచే రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

