loader

టీజీటెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌ ఇన్‌-సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/

ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఫామ్ హౌస్ ల పేరిట డ్రామాలు ఆడుతుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వమేనని చేతల ప్రభుత్వం కాదు అని దుయ్యబట్టారు. వచ్చే ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి ఫోటీ చేస్తారని పేర్కొన్నారు. లోపాయికారీ ఓప్పందాలలో భాగంగానే ఫామ్ హౌస్ లపై చర్యలు ఉండవని తెలిపారు.

డల్లాస్‌లో ఇండియన్స్‌పై పెరుగుతున్న ద్వేషం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌–ఫోర్ట్‌వర్త్‌ ప్రాంతంలో భారతీయ అమెరికన్లపై పెరుగుతున్న వ్యతిరేకత మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డల్లాస్‌ శివారు నగరమైన ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య పెరగడం, హెచ్‌-1బీ వీసాలు, వలస విధానాలపై ఉన్న రాజకీయ విభేదాలు క్రమంగా జాతి విద్వేష వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మొదలైన ప్రచారం సిటీ కౌన్సిల్‌ సమావేశాలు, రాజకీయ నిరసనలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టుల ఏర్పాటుకు ఆమోదం

రాష్ట్రంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించి, సామాన్య ప్రజలకు మరింత వేగంగా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో తొలి విడతలో 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు న్యాయ వ్యవహారాల కార్యదర్శి బి. పాపిరెడ్డి జీవో ఎంఎస్ నెం.59 ని జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 594 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపాదనలు పంపింది.

ఉద్యోగినికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడి

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో స్థానిక సంస్థలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని టార్గెట్ చేసి, అక్కడే ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాధితురాలికి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, 2023 నుంచి 2026 ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తప్పుగా తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో.. తాజాగా రేణు దేశాయ్ మరోసారి స్పందించారు. తన ఉద్దేశం మతాన్ని లేదా ధర్మాన్ని విమర్శించడం కాదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. తాను సనాతన ధర్మానికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. గణపతి బప్పాపై తనకు ఎంతో […]

ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ: కేటీఆర్

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు తొలి భూపోరాటానికి నాంది పలికి, ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ బహుజన ధీరత్వానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలను, సేవలను గుర్తించే విధంగా.. ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా కేసీఆర్ ప్రభుత్వం […]

44 ఏండ్ల నిరీక్షణకు తెర.. ఆసియా క్రీడల మారథాన్ లో భారత్ కు రజతం

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ సావన్‌ బర్వాల్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించి.. ఈ విభాగంలో భారత్‌ 44 ఏండ్ల నిరీక్షణకు తెరదించాడు. జపాన్‌లోని నాగోయాలో శనివారం జరిగిన ఫైనల్లో బర్వాల్‌ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. దీంతో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పాటు కొత్త జాతీయ రికార్డును నమోదు చేశాడు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. అప్పట్లో హోసూర్‌ కుక్కప్ప సీతారామ […]

ఆ ప్రసక్తే లేదన్న ట్రంప్.. నవంబర్ తర్వాత మారణహోమం జరగనుందా!

నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ట్రంప్ తన సహాయకులతో పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకునే దిశగా ఒప్పందం కోరుకుంటుందని ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తక్షణమే ఏడు రోజుల వ్యవధిలో హోర్ముజ్ జలసంధిని తెరవడానికి, అణు చర్చలను ప్రారంభించడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని […]

కాంగోలో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కిక్విట్ నగరం నుండి రాజధాని కిన్షాసా వైపు ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సాంకేతిక లోపం కారణంగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది. కిన్షాసాకు తూర్పున ఉన్న కెంగే ప్రాంత సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. .విమానం నేలను తాకగానే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా మొత్తం 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని కాంగో ఆర్మీ అధికారిక […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON