వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల్లో రాత్రివేళ డీజే సౌండ్స్‌పై చేసిన వ్యాఖ్యలతో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తప్పుగా తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో.. తాజాగా రేణు దేశాయ్ మరోసారి స్పందించారు. తన ఉద్దేశం మతాన్ని లేదా ధర్మాన్ని విమర్శించడం కాదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో
ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. తాను సనాతన ధర్మానికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. గణపతి బప్పాపై తనకు ఎంతో భక్తి ఉందని చెబుతూ.. తాను చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే స్పందించాలని నెటిజన్లను కోరారు.