వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు తొలి భూపోరాటానికి నాంది పలికి, ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ బహుజన ధీరత్వానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలను, సేవలను గుర్తించే విధంగా.. ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా కేసీఆర్ ప్రభుత్వం చేర్చిందని గుర్తుచేశారు