ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఏటీఎంల వినియోగంపై ఉన్న పరిమితులను సడలించాయి. ఈ మూడు రోజుల పాటు ఏటీఎంలలో పరిమితికి మించిన లావాదేవీలపై వేసే రుసుములను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.తమ స్వంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలను వినియోగించుకున్నప్పటికీ ఎటువంటి అదనపు ఛార్జీలు పడవు.