ఆర్యదాన్ మొహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట ప్రజాసేవకు అందించే బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏసీసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు.కేరళంలో వీచే రాజకీయ మార్పు గాలులు దిల్లీలో సునామీలా మారతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాధారణంగా రుతుపవనాలు కేరళలో ప్రారంభమై అనంతరం కర్ణాటక, తెలంగాణ, యూపీ, బెంగాల్ కు విస్తరిస్తాయని, రాజకీయాల్లోనూ అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.