సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కిక్విట్ నగరం నుండి రాజధాని కిన్షాసా వైపు ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సాంకేతిక లోపం కారణంగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది. కిన్షాసాకు తూర్పున ఉన్న కెంగే ప్రాంత సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. .విమానం నేలను తాకగానే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు సహా మొత్తం 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని కాంగో ఆర్మీ అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.