అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్–ఫోర్ట్‌వర్త్ ప్రాంతంలో భారతీయ అమెరికన్లపై పెరుగుతున్న వ్యతిరేకత మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డల్లాస్ శివారు నగరమైన ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య పెరగడం, హెచ్-1బీ వీసాలు, వలస విధానాలపై ఉన్న రాజకీయ విభేదాలు క్రమంగా జాతి విద్వేష వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం సిటీ కౌన్సిల్ సమావేశాలు, రాజకీయ నిరసనలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.