loader

టెలికాం, రైల్వే, పెట్రోల్ పేమెంట్లకు కేవలం రూ.5 ఫీజు!

యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త MDR (Merchant Discount Rate) విధానాన్ని ప్రకటించింది. కొన్ని కీలక రంగాలకు ప్రత్యేక MDR రేటును నిర్ణయించారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి ఎంపిక చేసిన రంగాల్లో జరిగే UPI చెల్లింపులకు 0.4% బదులు ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. అంటే ఈ కేటగిరీల్లో పేమెంట్ మొత్తం పెరిగినా, నిర్ణయించిన నిబంధనల ప్రకారం MDR రూ.5గానే ఉంటుంది.

భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నౌకాదళ నౌక

సముద్రంలో భారత నౌకాదళ నౌకతో పాకిస్థాన్ నౌకాదళ నౌక ఢీకొనడానికి కారణమైన పాక్ నౌకాదళ విభాగాల ఆమోదయోగ్యం కాని మరియు వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైన” ప్రవర్తనపై, సెప్టెంబర్ 16న భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ఉన్నత స్థాయి పాకిస్థాన్ దౌత్యవేత్తను పిలిపించి “తీవ్ర నిరసన” వ్యక్తం చేసింది. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగిందని, దీనివల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  అయితే, వారి ప్రవర్తన సైనిక విన్యాసాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఉందని తెలిపింది.

మోదీని కలిసిన వారం రోజుల్లోనే..

ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్ లో  తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.70 నుంచి రూ.80 వరకు చేరింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి క్వింటాల్ ధర రూ.5,200 నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవుతోందని, రోజుకు సుమారు 5,200 నుంచి 6,000 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

 ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ హోదా పొందిన సుమారు 9.09 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఫ్రీహోల్డ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని  ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హోదా  పొందిన 7.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1.36 లక్షల ఎకరాల గ్రామసేవా ఇనాం భూముల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించింది.

ఈ సాయంత్రం తెరచుకోనున్న శబరిమల ఆలయం తలుపులు: అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు.. కన్ని మాస పూజల కోసం ఈ సాయంత్రం తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5: 30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మేల్‌శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి, ప్రధాన తంత్రి బ్రహ్మదత్తన్ సమక్షంలో గర్భగుడి తలుపులను శాస్త్రోక్తంగా తెరిచి దీపారాధన చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు కన్ని మాస పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 21వ తేదీ ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు.

టీమిండియా టీ20 స్పెషలిస్ట్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్

భారత క్రికెట్ జట్టు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే వివాహ బంధంలోకి  అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి పెళ్లి తేదీ ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని హోటల్‌ రమడలో ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. చాలాకాలంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ వార్తలపై విస్తృతంగా చర్చ సాగింది.

ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మంగళవారం రోజున మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. నకిలీ మద్యం కేసులో వీరికి ముందస్తు బెయిల్ లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. కోర్టు వీరిద్దరికీ సెప్టెంబర్ 28 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘22A’ పరిష్కారానికి కమిటీ!

తెలంగాణలోని నిషేధిత జాబితాలో నమోదైన భూముల సమస్యల (22A Land Issue)కు శాశ్వత పరిష్కారం దిశగా, భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏళ్లుగా సాగుతున్న అసైన్డ్  భూముల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కరించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ, బాధ్యతలు స్వీకరించిన 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

లైవ్ కవరేజ్ మధ్యలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురి దుర్మరణం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కారు బస్సును ఢీకొట్టిన రోడ్డు ప్రమాదాన్ని లైవ్ కవరేజ్ చేయడానికి వెళ్లిన వార్తా సంస్థ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది.   ఆ దృశ్యాలను గగనతలం నుంచి కవర్ చేయడానికి KNBC-TV సంస్థకు చెందిన న్యూస్ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది.   అయితే, కవరేజ్ అందిస్తున్న సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రెండు వ్యాపార సముదాయల మధ్యలో హెలికాప్టర్ పడిపోయింది. దీంతో క్షణాల్లోనే అది పేలిపోయి పెద్ద ఎత్తున […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON