ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ హోదా పొందిన సుమారు 9.09 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఫ్రీహోల్డ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హోదా పొందిన 7.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1.36 లక్షల ఎకరాల గ్రామసేవా ఇనాం భూముల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించింది.