తెలంగాణలోని నిషేధిత జాబితాలో నమోదైన భూముల సమస్యల (22A Land Issue)కు శాశ్వత పరిష్కారం దిశగా, భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏళ్లుగా సాగుతున్న అసైన్డ్ భూముల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కరించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ, బాధ్యతలు స్వీకరించిన 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.